calender_icon.png 10 September, 2025 | 12:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహనీయుల బాటలో నడవాలి

09-09-2025 06:53:28 PM

బీసీ గురుకులాల ఆర్సిఓ శ్రీధర్..

కుమ్రం భీం అసిఫాబాద్ (విజయక్రాంతి): మహనీయులను స్ఫూర్తిగా తీసుకొని వారి బాటలో నడవాలని మహాత్మా జ్యోతిబాపూలే గురుకులాల రీజినల్ కోఆర్డినేటర్ శ్రీధర్(Sridhar) అన్నారు. ప్రజా కవి కాళోజి జయంతిని పురస్కరించుకొని ఆసిఫాబాద్ మండలంలోని బాబాపూర్ ఎం జె పి బాలికల గురుకుల పాఠశాలలో నిర్వహించిన తెలంగాణ భాష దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ యాస భాష అభివృద్ధి కోసం కాలోజీ తినలేని కృషి చేశారని తెలిపారు. ఆయన రచనలతో ఎంతోమంది చైతన్యవంతులు అయ్యారని గుర్తు చేశారు. నేటి విద్యార్థులు ఆయన రచనలను అనుసరించి ముందుకు సాగాలని సూచించారు. అంతకుముందు పాఠశాలలోని వంటగదిని స్టోర్ రూమ్ ను పరిశీలించారు. రికార్డులను తనిఖీ చేసి సిబ్బందితో సమావేశం నిర్వహించారు. విద్యార్థులకు అందుతున్న విద్య, వసతులపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సుకన్య, ఉపాధ్యాయురాలు, సిబ్బంది ,విద్యార్థులు పాల్గొన్నారు.