23-05-2025 02:19:22 AM
రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
కరీంనగర్, మే 22 (విజయ క్రాంతి): స్థా నిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పిటిసి అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెం డా ఎగురవేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గురువారం చిగు రు మామిడి మండల కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశంలో మం త్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంస్థాగతం గా కాంగ్రెస్ పార్టీ గ్రామగ్రామాన పునః వ్యవస్థీకరిస్తూ మండల సమావేశాలు జరుగుతు న్నాయన్నారు. శాసన సభలో నన్ను గెలిపించేందుకు పార్లమెంట్ ,ఎమ్మెల్సి ఎన్నికల్లో మెజారిటీ తెచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఇప్పుడు మీ ఎన్నికలు మీరు మరింత కష్టపడాలని నేను నా ఎన్నిక కన్నా ఎక్కువ కష్టపడతానని అన్నారు.
అం దరూ ఐక్యంగా కలిసి పని చేయాలని, గ్రామ స్థాయిలో కొత్త రక్తాన్ని తీసుకురావాలని, మూ డు సంవత్సరాల పైన పని చేసిన వారికి ప్రమోషన్ వస్తుందన్నారు. ప్రజా పా లన ప్రభుత్వంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని, అధికారంలోకి వచ్చిన 48 గంట ల్లో ఆర్టీసీ లో మహిళలకు ఉచిత బస్సు ప్ర యాణం,200 యూనిట్ల ఉచిత విద్యుత్ 50 0 కి గ్యాస్ రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ,సన్న బియ్యం పంపిణీ,స న్న వడ్ల కి 500 బోనస్,ఆరోగ్య శ్రీ 10 లక్షలకు వరకు చికిత్స,60 వేల ఉద్యోగాలు భర్తీ..
కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు ఇలా ఎన్ని కార్యక్రమాలు చేపట్టిందన్నారు. ఒకే సంవత్సరం 3500 ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామని, పేదలల్లో పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నామని, పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందన్నారు. రెండు నెలల్లో రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు వస్తున్నాయ ని, మొదట దశలో రాష్ట్రంలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామన్నారు.
గతంలో దొడ్డు బియ్యం దారిలోనే అమ్ముకునే పరిస్థితి ఉండేదని ఇప్పుడు సన్న బి య్యం అడిగి మరి తీసుకుంటున్నామన్నారు. గ్రామాల్లో సీసీ రోడ్లు,తాగునీటి సమస్యలు లేకుండా చేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్‌కి ఎవరైనా పని కోసం వస్తె హు స్నాబాద్ వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తున్నామని, హుస్నాబాద్ అంటే ఎక్కడికి వెళ్ళినా గౌర వం పెంచుతున్నామన్నారు.
మీ బిడ్డగా అ సెంబ్లీలో అభివృద్ధి లో అందుబాటులో ఉం టూ సమర్థవంతంగా పని చేస్తున్నానని, నాకు ఇంకా బలం రావాలంటే స్థానిక సంస్థ ల ఎన్నికల్లో అన్ని స్థానాలు విజయం సాధించాలన్నారు. గ్రామాల్లో ఇంటింటికి ప్రభు త్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు తీసుకెళ్లాలి.. అవగాహన కల్పించాలన్నారు. పార్టీ పటిష్టంగా ఉండి అన్ని స్థానాలు గెలిస్తేనే మ నకు గౌరవం ఉంటుందన్నారు.
గ్రామ శాఖ అధ్యక్షులను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని, సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పిటిసి ఎవరైనా ఐ క్యంగా నిర్ణయం తీసుకోవచ్చన్నారు. గ్రామగ్రామాన కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలని మంత్రి కోనం ప్రభాకర్ పిలుపునిచ్చారు. పీసీసీ పరిశీలకులు రఘునాథ్ రెడ్డి, నమిలా శ్రీనివాస్ లు మండల, గ్రామ, బ్లాక్ అధ్యక్షులకు దరఖాస్తుల స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.