23-05-2025 02:20:07 AM
ఇంటి నంబర్లతో రిజిస్ట్రేషన్లు
అధికారులను బురిడీ కొట్టించిన అక్రమార్కులు.
ప్రభుత్వ ఆదాయానికి గండి?
భద్రాద్రి కొత్తగూడెం మే 22 (విజయక్రాంతి) అడిగినంత ఇచ్చుకో.... ఇంటి నెం బర్ పుచ్చుకో అన్నట్లు ఉంది పాల్వంచ ము న్సిపాలిటీ అధికారుల పనితీరు. అసలు ఇల్లు లేకున్నా ఇంటి నెంబర్ కేటాయించడమే కా దు, కమర్షియల్ కాంప్లెక్స్ , నివాసం అని ని ర్ధారించి ఇంటి పన్ను విధించారంటే వాళ్లు మామూలు అధికారులు కాదని తేటతెల్లమవుతోంది. ఇల్లు లేని ఖాళీ స్థలాల్లో ఇంటి నెం బర్లు కేటాయించారనే ఆరోపణలపై విజయ క్రాంతి ప్రతినిధి క్షేత్రస్థాయి పరిశీలన చేస్తే ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూశాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణ పరిధిలోని దమ్మపేట రోడ్డులో శివనగర్ స మీపంలో 22-3-142/16/A/1, 22-3-142/18, 22-3-142/17/A/1 ఇంటి నెంబర్లు పొంది ఖాళీగా ఉన్న సుమారు 1500 గజాలు విక్రయించడం జరిగిందని వెళ్లడైంది. అసలు మ తలబ్ ఏమిటంటే నిషేదిత సర్వే నెంబర్ 817/84లో సుమారు 1500 గజాల భూ మి పట్టణంలోని ఓ ప్రముఖ వ్యాపారికి ఉం ది.
అట్టి భూమిలో ప్రభుత్వం వారు రిజిస్ట్రేషన్ లను రద్దు చేశారు. ఆ భూమిని ఏదో రూపంలో బదలాయించాలని మార్గాలు అ న్వేషించారు. రిజిస్ట్రేషన్ చేయాలంటే రెవె న్యూ నుంచి ఎలాంటి అభ్యంతరాలు లేకుం డా, లింకు డాక్యుమెంట్ కలిగి ఉండాల్సి ఉం ది. 817 సర్వే నెంబరు లో ఎలాంటి రిజిస్ట్రేషన్లు కొనసాగించ వద్దని జిల్లా కలెక్టర్ నుం చి ఆదేశాలు ఉండటం తో సబ్ రిజిస్టర్ 817 బై నెంబర్లలో రిజిస్ట్రేషన్ ను తిరస్కరిస్తున్నా డు.
దీంతో ఆ ప్రముఖ వ్యాపారి రిజిస్ట్రేషన్, మున్సిపల్, రెవెన్యూ అధికారులను ప్ర లోభాల గురిచేసి, ఖాళీ స్థలంలో తాత్కాలికంగా ఒక షెడ్డు నిర్మాణం చేసి మున్సిపాలిటీలో నెంబర్లు పొందినట్లు తెలుస్తోంది. వాటి ద్వారా సునాయాసంగా నిషేధిత భూ ములను రూ 4 కోట్లకు విక్రయించి సొమ్ము చేసుకున్నాడు. అట్టి భూమిని గత ఏడాది మే నెలలో ఇద్దరు వ్యక్తులు కొనుగోలు చేసి మున్సిపాలిటీలో పేరు మార్పిడికి దరఖాస్తు చేయడం జరిగింది.
సదరు మున్సిపల్ అధికారులు ఇల్లు లేని కారణంగా రికార్డుల్లో మీ పేరు నమోదు చేయడం కుదరదంటూ దరఖాస్తులను తిరస్కరించారు. క్రయా విక్రయా లు జరిగినప్పటికీ, దొడ్డి దారిన పొందిన ఇం టి నెంబర్లలో కొనుగోలు దారుని పేరు ము న్సిపాలిటీలో మార్పిడి జరగలేదు. దయచేసి ఆ ఇంటి నెంబర్ గల ఇండ్ల అడ్రస్ చూ పండి ప్లీజ్ అంటూ పట్టణ ప్రజలు ఎద్దేవా చేస్తున్నారు.
ఈ విషయమై పాల్వంచ మున్సిపల్ రెవెన్యూ అధికారి విజయలక్ష్మిని వివర ణ కోరగా. 2012 నుంచి ఇంటి నెంబర్ కేటాయించినట్లు రికార్డులో నమోదయి ఉందని, తాజాగా ఆ స్థలాన్ని కొనుగోలు చేసిన వ్యక్తు లు మున్సిపాలిటీలో తమ పేరు మార్చాలం టూ దరఖాస్తు చేశారు. క్షేత్రస్థాయిలో ఎలాంటి ఇండ్లు లేకపోవడంతో వారు చేసిన దరఖాస్తులు తిరస్కరించడం జరిగింది.
ఇండ్లు లేని ఇంటి నంబర్లను ఆన్లైన్‌లో రద్దు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కానీ రిజిస్ట్రేషన్ సమయంలోనే మోటివేషన్ ఫీజు చెల్లించడంతో పేరు మార్పిడు జరుగుతుంది. మళ్లీ పేరు మార్పిడికి దరఖాస్తులు ఏంటో అంత చిక్కటం లేదు. జిల్లా కలెక్టర్ ఈ అంశంపై పూర్తిస్థాయిలో విచారణ నిర్వహించాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.