23-05-2025 02:21:51 AM
జహీరాబాద్, మే 22 : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో జహీరాబాద్ వచ్చిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను నిర్వహిస్తారా పని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల హామీలు భాగంగా రైతుబంధు ఎప్పుడు ఇచ్చేది స్పష్టం చేస్తారని ఎదురుచూస్తున్నారు. గత ప్రభుత్వం ప్రతి సంవత్సరం రెండుసార్లు సమయానుకూలంగా రైతుల ఖాతాలో డబ్బులు వేసేవారు.
కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుబంధు సక్రమంగా వేయలేదని, రెండు దఫాలు బకాయి ఉన్నందున ఆ బకాయిలను ప్రకటిస్తారేమోనని ప్రజలు ఎదురుచూస్తు న్నారు. అదేవిధంగా ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలైన కుటుంబంలోని ఇద్దరు వృద్ధులకు పెన్షన్ మంజూరు చేస్తామని, కాలేజీకి వెళ్లే బాలికలకు స్కూటీలు, అదేవిధంగా నిరుద్యోగ భృతి, తులం బంగారం ఇస్తానని ఎన్నికల హామీలు ప్రకటించిన విషయం తెలిసిందే.
అయినప్పటికీ ఈ బహిరంగ సభలో ఎప్పటినుంచి ఇస్తారో ప్రకటిస్తారని ఆశతో జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్నారు. జహీరాబాద్ నియోజకవర్గం లో రైతులు వ్యవసాయం బోరు బావులు మీదనే ఆధారపడటంతో కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.
గత ప్రభుత్వం 24 గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్తును సరఫరా చేయటంతో రైతులు సంతోషం వ్యక్తం చేసేవారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం కరెంటు కష్టాలు రావడంతో బిక్కుబిక్కుమంటూ తమ పంటలను కాపాడుకోలేకపోతున్నారు.
ఎత్తిపోతల పథకం ఏమైంది..
జహీరాబాద్ నియోజకవర్గానికి సాగునీరు అందించేందుకు గత ప్రభుత్వం బసవేశ్వర సంగమేశ్వర ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించింది. రైతులకు వ్యవసాయానికి నీరు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దానికి సంగమేశ్వర బసవేశ్వర ఎత్తిపోతల పథకం ద్వారా జహీరాబాద్ నియోజకవర్గంలోని జరా సంఘం, జహీరాబాద్, కోహ్లీ, మొగుడంపల్లి, న్యాల్కల్ గ్రామాలకు వ్యవసాయానికి నీరును అందిం చేందుకు ప్రణాళికను సిద్ధం చేసింది.
ప్రభుత్వం మారడంతో ఈ ఎత్తిపోతల పథకం ఇంతవరకు అమలుకు నోచుకోవడం లేదు. ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్లు ఎప్పుడు వస్తాయో, తమ పంట పొలాలకు సాగునీరు ఎప్పుడు ఇస్తారో అని రైతులు ఎదురుచూస్తున్నారు. ఈ విషయంపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభలో క్లారిటీ ఇస్తారని రైతులు ఎదురుచూస్తున్నారు.