06-08-2025 12:00:00 AM
కాంగ్రెస్ పార్టీ నాయకుడు నర్సింలు
తాండూరు 5 ఆగస్టు (విజయక్రాంతి): పేదల కళ్ళల్లో ఆనందం చూడడమే సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని వికారాబాద్ జిల్లా పెద్దెముల్ మండలం తట్టేపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నర్సింలు అన్నారు.మంగళవారం ఆయన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గోపాల్ తో కలిసి గ్రామంలో రేషన్ కార్డులు లేని 164 మందికి రేషన్ కార్డులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా నరసింహులు మాట్లాడుతూ గత టిఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్లలో అధికారంలో ఉండి ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని దీంతో పేద ప్రజలు రేషన్ బియ్యం అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆరోపించారు.ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదలందరికీ రేషన్ కార్డులు అందించి వారి కళ్ళల్లో ఆనందం చూస్తున్నామని అన్నారు.ఇంకా ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ శంకర్ నాయక్, రేషన్ డీలర్ అంజయ్య మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భారీగాపాల్గొన్నారు.