06-08-2025 12:00:00 AM
ఖమ్మం, ఆగస్ట్ 5 (విజయ క్రాంతి)ఖ మ్మం సర్కిల్ లోని తిరుమలయపాలెంలో పనిచేస్తున్న అసిస్టెంట్ ఇంజనీర్ ఆర్ భాస్కరరావు, ఏ. ఎల్ .ఎం యు.జగత్ జీవన్ లు అవినీతికి పాల్పడడంతో టీజీఎన్పీడీసీఎల్ యాజమాన్యం సస్పెండ్ చేసిందని ట్రాన్స్కో ఖమ్మం సర్కిల్ ఎస్ ఇ ఇనుగుర్తి శ్రీనివాసచారి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపా రు. చింతల్ తండా రైతులు కొత్త వ్యవసాయ సర్వీసుకు దరఖాస్తు చేసుకోగా ,
మంజూరు చేసే విషయంలో లక్ష రూపాయలు డిమాం డ్ చేసి 90,000 రూపాయలు తీసుకున్నట్లు విజిలెన్స్ ఎంక్వయిరీ లో వెల్లడైందని పేర్కొన్నారు. వినియోగదారులకు మెరుగైన, నా ణ్యమైన సేవలు అందించే విషయంలో ఎ టువంటి అవినీతి ఆరోపణలకు పాల్పడిన ఉపేక్షించేది లేదని, వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యం తెలిపింది.
అర్.భాస్కర్ రావు, యు. జగత్ జీవన్ పై డిపార్ట్మెంటల్ ఎంక్వయిరీ చేపడుతున్నామని స్పష్టం చేసిం ది. ఎవరైనా అవినీతికి పాల్పడితే తెలియజేయాలని ఫోన్ నెంబర్ కు 9281033233 తెలియపరచాలని ఆయన కోరారు.