calender_icon.png 6 August, 2025 | 11:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంత్రి శ్రీధర్‌బాబుకు ఘనస్వాగతం

06-08-2025 12:00:00 AM

మేడ్చల్, ఆగస్టు 05(విజయ క్రాంతి): జిల్లా ఇన్చార్జి మంత్రి డి శ్రీధర్ బాబు కు మంగళవారం మేడ్చల్ లో ఘన స్వాగతం లభించింది. రేషన్ కార్డులు, షాద్ ముబారక్, కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేయడానికి మేడ్చల్ వచ్చిన సందర్భంగా స్థానిక నాయకులు స్వాగతం పలికి సన్మానించారు. నియోజకవర్గ ఇన్చార్జి వజ్రేష్ యాదవ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ శ్రీనివాస రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింలు యాదవ్, కాంగ్రెస్ నాయకులు వేముల శ్రీనివాసరెడ్డి, గోమారం రమణారెడ్డి, కౌడె మహేష్, మల్లేష్ గౌడ్, చాపరాజు, ఉదండపురం సత్యనారాయణ, జకాట దేవా తదితరులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.