calender_icon.png 21 September, 2025 | 5:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

"ఎంగిలి పువ్వు" బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన కుంభం కిరణ్ జ్యోతి రెడ్డి

21-09-2025 04:38:10 PM

వలిగొండ (విజయక్రాంతి): తెలంగాణ ఆడపడుచులు అత్యంత వైభవంగా సంస్కృతి, సాంప్రదాయాలు ప్రతిబింబించేలా తీరొక్క పూలతో బతుకమ్మను అందంగా తీర్చిదిద్ది పండుగను నిర్వహించుకుంటారు. తొమ్మిది రోజులపాటు నిర్వహించే ఈ బతుకమ్మ పండుగలో మొదటి రోజైన ఎంగిలి పువ్వు బతుకమ్మ సందర్భంగా భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి(MLA Kumbam Anil Kumar Reddy) సతీమణి కుంభం కిరణ్ జ్యోతి రెడ్డి భువనగిరి నియోజకవర్గం ఆడపడుచులందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. బతుకమ్మ పండుగను మహిళలంతా సంతోషంగా, ఆనందోత్సవాలతో జరుపుకోవాలని ఆమె కోరుకున్నారు.