25-11-2025 08:24:37 PM
మోతే: సూర్యాపేట నుంచి ఖమ్మం వైపుగా వెళ్తున్న బైక్ ను అతివేగంతో కారు ఢీకొంది. ఈ ఘటన మోతే మండల పరిధిలోని హుస్సేనాబాద్ గ్రామ శివారులో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... కుడకుడ గ్రామానికి చెందిన వ్యక్తి బైక్ పై శుభకార్యానికి ఖమ్మం వెళుతున్న క్రమంలో కారు ఢీకొనడంతో బైక్ పై వెళ్తున్న వ్యక్తికి స్వల్ప గాయాలు కాగా సూర్యాపేట మెట్రో హాస్పిటల్ కు తరలించినట్లు తెలుస్తోంది. ప్రమాదం చోటుచేసుకున్న కారులో ఐదుగురు వ్యక్తులు ఉన్నారని, వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదని సమాచారం.