25-11-2025 08:52:00 PM
పుట్టిన ప్రతి బిడ్డకి వ్యాధి నిరోధక టీకాలు అందించాలి..
గరిడేపల్లి (విజయక్రాంతి): మండల కేంద్రమైన గరిడేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ కోటి రత్నం మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని అన్ని రికార్డులను ఆమె పరిశీలించారు. వ్యాధి నిరోధక టీకాలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. వ్యాధి నిరోధక కోల్డ్ చైన్ విధానాన్ని, ఆరోగ్య కేంద్రంలోని రిఫ్రిజిరేటర్ లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పుట్టిన ప్రతి ఒక్కరికి వ్యాధి నిరోధక టీకాలను వేయించాలన్నారు. పిల్లలకు అన్ని రకాల టీకాలు సకాలంలో 100% అందించాలని కోరారు. కార్యక్రమంలో డాక్టర్ నరేష్, వి.సి.సి.ఎం లతీఫ్, ఆరోగ్య కేంద్రం అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.