calender_icon.png 25 November, 2025 | 11:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డ్రంక్ అండ్ డ్రైవ్.. ఒకరికి రూ.10 వేల జరిమానా

25-11-2025 09:01:48 PM

మరొకరికి ఏడు రోజుల జైలు..

సిద్దిపేట క్రైం: మద్యం తాగి వాహనాలు నడిపిన ఇద్దరు వ్యక్తుల్లో ఒకరికి రూ.10 వేలు జరిమానా, ఒక రోజు జైలు, మరొకరికి 7 రోజుల జైలు శిక్ష న్యాయమూర్తి విధించారని సిద్దిపేట టూటౌన్ ఇన్స్పెక్టర్ ఉపేందర్ తెలిపారు. కొన్ని రోజుల క్రితం సిద్దిపేట టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రధాన చౌరస్తాలలో వాహనాలు తనిఖీ చేయగా, ఇద్దరు వ్యక్తులు మద్యం తాగి వాహనాలు నడుపుతుండగా పట్టుకున్నామని చెప్పారు. వారిని మంగళవారం సిద్దిపేట ఒకటో అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ తరణి ఎదుట హాజరుపరచగా విచారణ చేసి జరిమానా, జైలు శిక్ష విధించారని పేర్కొన్నారు.