calender_icon.png 25 November, 2025 | 11:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డీసీసీ అధ్యక్షుడిని ఘనంగా సన్మానించిన ఎమ్మెల్యే

25-11-2025 08:53:48 PM

మహబూబ్‌నగర్ (విజయక్రాంతి): ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో మహబూబ్‌నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నూతనంగా ఎన్నికైన సంజీవ్ ముదిరాజ్ ని ఎమ్మెల్యే  యెన్నం శ్రీనివాస్ రెడ్డి శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీని మరింత బలోపేతం చేసి ప్రజా సమస్యల పరిష్కారంలో సమిష్టిగా పని చేయాలని ఆకాంక్షించారు. కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన సంజీవ్ ముదిరాజ్ పార్టీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసి కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బెక్కెరి మధుసూదన్ రెడ్డి, సీజే బెనహర్, ప్రవీణ్ కుమార్, రఘుపతి రెడ్డి, రియాజ్, తాహెర్, బండిమల్లేష మల్లేష్ తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.