25-11-2025 08:44:42 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి మంగళవారం సైకిల్ పై సవారీ చేశారు. ఇనుగుర్తి మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న 60 మంది పేద విద్యార్థులకు భూక్యా శోభన్ బాబు ఉచితంగా సైకిళ్లను సమకూర్చి మార్కెట్ చైర్మన్ చేతులమీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి శోభన్ బాబుతో కలిసి సైకిల్ పై సవారీ చేసి సందడి చేశారు. సుదీర్ఘకాలం తెలుగుదేశం పార్టీలో పనిచేసిన సమయంలో తమ ఎన్నికల గుర్తు సైకిల్ కావడంతో ఆయన సైకిల్ పై మమకారాన్ని మరోమారు చాటుకున్నారు.