calender_icon.png 25 November, 2025 | 10:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాలనీ సమస్యల గురించి ఎమ్మెల్యేకు వినతి పత్రం

25-11-2025 08:26:16 PM

హనుమకొండ,(విజయక్రాంతి): గుండ్ల సింగారంలోని జీవీఎస్ఆర్ కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు కాలనీలోని పలు సమస్యల పైన వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజుని కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం కాలనీ అధ్యక్షుడు కుక్కల రాజు మాట్లాడుతూ... కాలనీలోని పలు సమస్యలు, సిసి రోడ్స్, డ్రైనేజీ సిస్టం, విద్యుత్ స్తంభాలు గురించి, భద్రత కోసం సీసీ కెమెరాలు మార్చాలని తదితర సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళమని,దానికి ఎమ్మెల్యే సానుకూలంగా  స్పందించి తక్షణమే అభివృద్ధి పనులు మొదలు పెడతామని హామీ ఇచ్చారు అన్నారు.