25-11-2025 08:46:59 PM
గరిడేపల్లి (విజయక్రాంతి): మండలంలోని వెలిదండ గ్రామంలో అనారోగ్యంతో చికిత్స పొందిన బాధిత కుటుంబాలకు మంగళవారం ముఖ్యమంత్రి సహాయనిధికి సంబంధించిన చెక్కులను అందజేశారు. వెలిదండ గ్రామానికి చెందిన చనగాని లక్ష్మయ్య, రమణకు 45,500, ఝాన్సీకి 27,500 రూపాయల చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు చనగాని సాంబయ్య, మాజీ సర్పంచి ఆదూరి పద్మ కోటయ్య,మోహన రంగా తదితరులు పాల్గొన్నారు.