25-11-2025 08:28:55 PM
అగ్రికల్చర్ శ్రీనివాస్ యాదవ్..
పెద్దమందడి: పెద్దమందడి మండల కేంద్రంలోని ప్రైమరీ పాఠశాలలో విద్యార్థులకు మంగళవారం రోజు బొందల కొండయ్య మనుమడు బి. ద్రువిత్ ఆర్యన్ జన్మదిన సందర్భంగా మండలం వ్యవసాయ అధికారి శ్రీనివాసులు కుటుంబ సమేతంగా విచ్చేసి పెద్దమందడి ప్రైమరీ పాఠశాల విద్యార్థులకు రూ 4000 విలువ గల నోటు పుస్తకాలు పెన్నులు అందజేసారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ యాదవ్, కుటుంబసభ్యులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. వారి కుటుంబ సభ్యులకు మా పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయుల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.