23-08-2025 06:32:46 PM
హనుమకొండ,(విజయక్రాంతి): పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్ మెంట్ ను వెంటనే విడుదల చేయాలని కూడా మాజీ చైర్మన్ మాస్టర్ జి విద్యాసంస్థల అధినేత ఎస్. సుందర్ రాజ్ అన్నారు. శనివారం ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెండింగ్ లో ఉన్న బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఫీజు దీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సుందర్ రాజు హాజరై దీక్ష చేస్తున్న ఎస్ఎఫ్ఐ నాయకులకు పూలమాలలు వేసి వారికి మద్దతు తెలిపారు. వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్ మెంట్ ను విడుదల చేయకుండా విద్యార్థులను గోస పెడుతుంది అన్నారు.
వెంటనే పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలను విడుదల చేయాలన్నారు పెండింగ్ బకాయిలు విడుదల చేయకుంటే తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులను అందరిని కలుపుకొని ఎమ్మెల్యేల, ఎంపీల, మంత్రుల ఇండ్లను ముట్టడిస్తామన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్న అని అన్నారు. విద్యార్థుల పక్షాన ఉండి పోరాడతా అని వారు తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామెర కిరణ్ మాట్లాడుతూ రాష్ట్రంలో 8158 కోట్ల స్కాలర్షిప్స్ ఫీజు రీయింబర్స్ మెంట్ పెండింగ్ లో ఉన్నాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు.
విద్యార్థులు అనేకమైన సమస్యలతో రాష్ట్రంలో తీవ్రమైన ఇబ్బందులు బందులు పడుతున్నారని అన్నారు. ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు స్టాలిన్, మంద శ్రీకాంత్ లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు దగ్గరికి వస్తున్న కూడా ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రానికి విద్య శాఖ మంత్రి లేకపోవడం సిగ్గుచేటు అన్నారు.