calender_icon.png 25 September, 2025 | 3:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదల సొంతింటి కల నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

25-09-2025 12:47:56 AM

ఇందిరమ్మ నమూనా భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పాయం 

బూర్గంపాడు,సెప్టెంబర్24,(విజయక్రాంతి):సొంతింటి కల నెరవేరుస్తూ బడుగు బలహీన వర్గాల పేద ప్రజల ఆకాంక్షను కాంగ్రెస్ ప్రభుత్వం తీరుస్తుందని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం బూర్గంపాడు మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల నమూనా భవనాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం నమూనా భవనంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సొంతింటి కళ నెరవేరుస్తుందన్నారు. నియోజకవర్గంలోని అర్హులైన ప్రతి పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇల్లును దశలవారీగా అందరికీ మంజూరు చేస్తానని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులు నిర్మించే ఇల్లు 400 చదరపు అడుగులకు తక్కువగా ఉండకూడదని, 600 చదరపు అడుగులను మించకూడదని ఆయన స్పష్టం చేశారు.

ప్రజాస్వామ్యంలో మీడియా ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తోందని, ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య విలేకరులు వారధిగా పని చేస్తున్నారని అన్నారు. వారి సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తామని చెప్పారు. అర్హులైన జర్నలిస్టులకు ఇంటి స్థలాలు, ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తానని అన్నారు. అనంతరం ఉపాధి హమీ కూలీలకు పనిముట్లను అందజేశారు.

మండల వ్యాప్తంగా రూ.13,1228 లక్షలతో 377 టీములకు గాను 6885 మంది ఉపాధి హామీ పథకం ద్వారా ఈ పనిముట్లను అందుకుంటున్నారని తెలిపారు. అనంతరం మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు.ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిలపై ఆరా తీశారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యాన్ని అందించాలని డాక్టర్లను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో తహశీల్దార్ ప్రసాద్, ఎంపీడీవో జమలా రెడ్డి,ఏవో శంకర్,ఏఈ సందీప్ ,ఎంపీఓ బాలయ్య,ఎంపీడీవో విజయలక్ష్మి,హౌసింగ్ ఏఈ సత్య,ఎంఈఓ సింహరాజు,ఆస్పత్రి సూపర్డెంట్ ముక్కుంటేశ్వరరావు,మండల అధ్యక్షులు దుగ్గంపూడి కృష్ణారెడ్డి, టిపిసిసి లీగల్ సెల్ జిల్లా కన్వీనర్ భజన సతీష్,నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు బర్ల నాగమణి, నాయకులు కైపు శ్రీనివాసరెడ్డి, మహమ్మద్ ఖాన్,రోశిరెడ్డి భజన ప్రసాద్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.