calender_icon.png 25 September, 2025 | 2:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జోగుళాంబదేవికి బంగారు మకర తోరణం

25-09-2025 12:49:02 AM

వాటి రూ.55 లక్షలు ఉంటుందని అంచనా బహూకరించిన హైదరాబాద్ వాస్తవ్యులు 

అలంపూర్ సెప్టెంబర్ 24: జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ లో కొలువుదీరిన జోగుళాంబదేవికి హైదరాబాద్ కు చెందిన తీగల క్రాంతిరెడ్డి-లక్షీ స్రవంతి దంపతులు బంగారు పూతతో కూడిన మకరతోరణం ,పీఠానికి తొడుగును బహూకరించారు.దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు పురస్కరించుకొని బుధవారం ఆలయ ఈవో దీప్తి ,ధర్మకర్తలకు ఈ మకరతోరణ పీఠ తొడుగును దంపతులు కుటుంబ సమేతంగా అందించారు.

వీటి విలువ సుమారు రూ.55 లక్షలు ఉంటుందని ఆలయ ఈవో దీప్తి తెలిపారు.ముందుగా వారు జోగుళాంబదేవి, బాల బ్రహ్మేశ్వర స్వామి వారిని దర్శించుకుని పూజలు చేశారు. మకర తోరణం పీఠానికి తొడుగును బహూకరించిన దం పతులకు అర్చకులు తీర్థప్రసాదాలు అందజేసి వేద ఆశీర్వచనం పలికారు.ఆలయ ఈవో ధర్మకర్తలు వారిని శేష వస్త్రాలతో సత్కరించారు. కాగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరిం చుకొని ఆలయాలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకోవడం ఎంతో అదృష్టభాగ్యమని దంపతులు తెలిపారు.