11-02-2025 12:00:00 AM
యాదాద్రి భువనగిరి, ఫిబ్రవరి 10 (విజయక్రాంతి) : బీసీ కులాలపై కాంగ్రెస్ ప్రభుత్వం కాకి లెక్కలు చెబుతూ... వారిని మోసం చేస్తుందని ఆలేరు మాజీ ఎమ్మెల్యే బీఆర్‌ఎస్ నాయకుడు బూడిద భిక్షమయ్య గౌడ్ ఆరోపించారు. సోమవారం నాడు జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడు తూ బీసీలు అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి మొదటి నుండి చిన్న చూపేనని ఆవేదన వ్యక్తం చేశారు. జనాభాలో మేమెంతుంటే మాకంతా వాటా రావాల్సిందేనని డిమాం డ్ చేశారు.
రాహుల్ గాంధీ నినాదాన్ని అమలు చేయకుండా తిలోదకాలిస్తూ రేవం త్ రెడ్డి ధిక్కార స్వరం వినిపిస్తున్నారని ఆరోపించారు. అసెంబ్లీలో చర్చ చేస్తే లా భం లేదని, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే స్థానిక ఎన్నికల్లో బిసి రిజర్వేషన్లు పెంచడం కోసం అసెంబ్లీలో బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు.బీసీలకు 46.3%, ముస్లిం బీసీలకు 10 శాతం మొత్తం కలిపి 56 శాతం రిజ ర్వేషన్లను అమలు చేయాలని మాజీ ఎమ్మె ల్యే కొరారు.
రాజ్యాంగం పట్టుకుని దేశ మంతా తిరిగే రాహుల్ గాంధీ బీసీల విషయంలో ఎందుకు వెనక్కు తగ్గుతున్నా రని ప్రశ్నించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో 83 లక్షల ఇళ్లు... 3.5 కోట్ల జనాభా ఉన్నట్లు తేలిందన్నారు. 2014 లో కేసీఆర్ నిర్వహించిన సమగ్ర సర్వే లో 1.03 కోట్ల ఇళ్లు, 3 కోట్ల 68 లక్షల జనాభా అని తేలింది అప్పడు నాలుగేళ్ల వ్యవధిలో చేసిన సర్వేలోనే 20 లక్షల ఇళ్ళు ఎలా పెరిగాయని బిక్షమయ్య గౌడ్ ప్రశ్నించారు.2014- 2024 వరకు పదేళ్ళలో ఎన్ని ఇళ్ళు ఎంత జనాభా ఉండలి? ఎన్ని కుటుంబాలు పెరగాలి అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ కులగణన తప్పుల తడకని అన్నా2011 నుంచి 14 వరకు 20 లక్షల ఇల్లు పెరిగితే... 2014 నుంచి పదేళ్లలో సుమారు 60 లక్షల కుటుంబాలు పెరగాలి.ఏ లెక్కన చూసినా తెలంగాణలో 50 నుంచి 52 శాతం బీసీలు ఉన్నట్లు స్పష్టమవుతుందని ప్రభుత్వం మాత్రం 46.2శాతం ఉన్నట్లు తేల్చడం బాధాకరం అన్నారు.రిజర్వేషన్లను పెంచిన తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలి. అని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇదే తరహా మొసాన్ని బీహార్, కర్నాటకలో చేసింది.. తెలంగాణలో కూడా మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు అని ఆరోపించారు.
సకల జనుల సర్వేకు, కులగరణ సర్వేకు 21 లక్షల బీసీ జనాభా తేడా కనిపిస్తున్న దని, ఈ సర్వేలో చాలా ఎక్కువ కనిపిస్తోం దని, ఈ లెక్కలు ముఖ్యమంత్రి సరిచేశార నేది స్పష్టమవుతుందన్నారు. కేవలం ఓసీల జనాభా పెరిగి బీసీ, ఎస్సీ, ఎస్టీల జనాభా తగ్గుతుందా ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు.
సకల జనుల సర్వే ద్వారా కేసీఆర్ మొదటి అడుగు వేశారు. డేటా ఆధారంగా కేసీఆర్ అనేక పథకాలు, కార్యక్రమాలు నిర్వహించారన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ డాక్టర్ జడల అమరేం దర్ గౌడ్, జిల్లా పార్టీ బీసీ నాయకులు పట్టణ పార్టీ బీసీ నాయకులు పాల్గొన్నారు.