10-02-2025 10:57:06 PM
నల్లగొండ (విజయక్రాంతి): నల్లగొండ జిల్లా కేంద్రంలోని టీటీడీ కల్యాణ మండపంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో వారం రోజులుగా కొనసాగిన సరస్ ప్రదర్శన సోమవారం ముగిసింది. స్వయం సహాయక సంఘాలు సభ్యులు తయారుచేసిన ఉత్పత్తులకు వినియోగదారుల నుంచి మంచి ఆదరణ లభించిందని డీఆర్డీఓ శేఖర్‌రెడ్డి తెలిపారు. స్వయం సహాయక సంఘాల బలోపేతానికి, మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు ఇలాంటి ప్రదర్శనలు దోహదం చేస్తాయని ఆయన పేర్కొన్నారు. అనంతరం స్టాళ్ల నిర్వాహకులకు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు. ప్రదర్శనలో చేనేత ఉత్పత్తులు, పచ్చడ్లు, వన్ గ్రామ్ అర్నమెంట్స్, మట్టిపాత్రలు బాగా అమ్ముడయ్యాయని స్టాళ్ల నిర్వాహకులు వెల్లడించారు. కార్యక్రమంలో నాబార్డ్ డీడీఎం, డీఎఫ్ఓ, అదనపు మార్కెటింగ్ అధకారి, డీపీఎం, ఏపీఎం, అడ్మిన్ అసిస్టెంట్స్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.