calender_icon.png 24 November, 2025 | 8:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాశీలో వెంకట్రావుపేట వాసి మృత్యువాత

11-02-2025 12:00:00 AM

కోనరావుపేట, ఫిబ్రవరి 10: కొనరావు పేట మండలం వెంకట్రావుపేట గ్రామానికి చెందిన కదిరే శ్రీనివాస్ గౌడ్ (45) కాశీలో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలి పిన వివరాల ప్రకారం.... నాలుగు రోజుల క్రితం స్నేహితులకు కలిసి ప్రయాగ్ రాజ్ లోని కుంభమేళా కు వెళ్లారు. కుంభమేళలో స్నానం చేసి అక్కడి నుండి అయోధ్య రామ మందిరాన్ని దర్శించుకొని ఆదివారం కాశీకి వెళ్లారు.కాశీలో స్వామి వారి దర్శనం కోసం క్యూ లైన్ లో వేచి ఉండగా స్పృహతప్పి కిందపడ్డాడు.

గమనించిన స్నేహితులు స్థానిక హాస్పటల్ తరలించారు. కాగా శ్రీని వాస్ బ్రెయిన్ స్ట్రోక్ తో మృతిచెందాడని వైద్యులు సూచించినట్లు కుటుంబ సభ్యుల కు ఫోన్‌లో సమాచారం అందించారు. విష యం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీ రుమున్నీరుగా విలపించారు.శ్రీనివాస్ కు భార్య మనీషా కూతురు ,కుమారుడు ఉన్నా రు. మృతదేహాన్ని మృతుని స్నేహితులు కాశీ నుండి అంబులెన్స్ లో తీసుకువస్తు న్నారు. మంగళవారం మృతదేహం ఇంటికి చేరుకుంటుందని తెలిపారు.