23-01-2026 12:14:10 AM
మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి
నాగర్ కర్నూల్, జనవరి 21 (విజయక్రాంతి): 6 గ్యారంటీలు, 420 మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బొంద పెట్టాలని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం నాగ ర్కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని 12, 13 వార్డుల్లో పర్యటించి ప్రజలను కలుసుకుని సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ పాలనలో త్రాగునీటి సమస్య పెరిగిందన్నారు. తమ పార్టీ తరఫున పోటీ చేసే అభ్య ర్థులను ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.