calender_icon.png 23 January, 2026 | 1:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామ అభివృద్ధికి చేసిన సేవలు కలకాలం గుర్తుండాలి

23-01-2026 12:13:50 AM

సర్పంచులకు మంత్రి సీతక్క పిలుపు 

జయశంకర్ భూపాలపల్లి మహబూబాబాద్, జనవరి 22 (విజయక్రాంతి): గ్రామా లు కన్నతల్లి లాంటివని, గ్రామ అభివృద్ధికి చేసిన సేవలు కలకాలం గుర్తుండిపోతాయ ని, నూతనంగా ఎన్నికైన సర్పంచులు గ్రామాభివృద్ధికి విశేష కృషి చేయాలని రాష్ట్ర పం చాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో గురువారం సర్పంచ్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో మంత్రి సీతక్క పా ల్గొన్నారు.

ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి పం చాయతీలకు వచ్చే నిధులపై పూర్తిగా అవగాహన కల్పించుకోవాలని, మీ గ్రామాలను ఆ దర్శవంతంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చా రు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ఇప్పటికే 237 కోట్ల రూపాయలు విడుదల చేసిందని, సర్పంచులు, ఉపసర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు వార్డు సభ్యులతో సమన్వ యం చేసుకుంటూ గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి మాస్టర్ ప్లాన్ రూపొందించుకోవాలని సూచించారు. 

మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యం

రాష్ట్ర ప్రభుత్వం కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడం లక్ష్యంగా నిర్ణ యించిందని, మహిళల ఆర్థిక అభివృద్ధికి అ వసరమైన బ్యాంకు, మహిళా సంఘాల ద్వా రా రుణాలు ఇవ్వడం, స్థానిక వనరులతో స్వయం ఉపాధి అవకాశాలకు పెద్దపీటవేయడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా బలోపేతం కావాలని మహిళలకు పిలుపునిచ్చారు.

మహిళలను వ్యాపార అభివృద్ధిలో ప్రావీణ్యం పెంపొందించే విధంగా ప్రభుత్వం ప్రత్యేకంగా కార్యా చరణ చేపట్టిందని, ఇందులో భాగంగా ధాన్యం కొనుగోలు, ఆర్టీసీ అద్దె బస్సులు, పె ట్రోల్ పంపుల నిర్వహణ తదితర అవకాశాలను కల్పించిందన్నారు. మహిళలకు ఇందిర మ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు. 

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సంకీర్త్, క్రెడిట్ కార్పొరేషన్ చైర్మన్ ఐత ప్రకాష్ రెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజబాబు, ఆర్డీవో హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.