calender_icon.png 27 September, 2025 | 9:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దళితుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ వివక్ష నశించాలి

27-09-2025 07:57:29 PM

గద్వాల నియోజకవర్గంలోని 5 మండలాల్లో దళితులు లేరా ?

గద్వాల: దళితుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ వివక్ష నశించాలని గద్వాల నియోజకవర్గంలోని 5 మండలాల్లో దళితులు లేరా అని బీఆర్ఎస్ నాయకులు గంజిపేట రాజు శనివారం ఒక ప్రకటన ద్వారా అన్నారు. నేడు గద్వాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో రిజర్వేషన్ ప్రక్రియను తీయడం జరిగిందని, అయితే గద్వాల నియోజకవర్గంలో ఐదు మండలాలలో ఎక్కడ కూడా దళితులు ఓటర్లు లేరా..? ఈ ఐదు మండలాల్లో ఏ ఒక్క గ్రామంలో గానీ, మండలలలో గానీ,ఏ పల్లెలలో గానీ దళిత ఓటర్లు లేరా..? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళులేని కబోధిలా దళితుల పట్ల వివక్ష వ్యవహరిస్తోందన్నారు.

ఈ ఐదు మండలాలు ఏ ఒక్క మండలంలో కూడా జెడ్పిటిసి మరియు ఎంపీపీ స్థానాలలో దళితులకు ఎందుకు ఖరారు చేయలేదని దళితుల పట్ల ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ వివక్షకు దిగడం సిగ్గుచేటన్నారు. దళితుల పట్ల రాజకీయ కక్ష పూరితమైన కుట్రలో భాగంగానే గద్వాల నియోజకవర్గంలోని 5 మండలాల్లో ఒక్క మండలంలో కూడా జడ్పీటీసీ,ఎంపీపీ రిజర్వేషన్లు కల్పించలేదంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్నికి దళితుల పట్ల ఉన్న వివక్ష ఏంటో తెలుస్తుందన్నారు.