calender_icon.png 27 September, 2025 | 10:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పిచ్చికుక్క దాడిలో ముగ్గురికి గాయాలు

27-09-2025 08:50:19 PM

అలంపూర్: గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం రాజోలి మండల పరిధిలోని పచ్చర్ల గ్రామంలో ఓ పిచ్చి కుక్క విధుల వెంట తిరుగుతూ స్వైర విహారం చేస్తూ... విధుల్లో వెళుతున్న వారిపై దాడి చేసి గాయపరిచింది. ఈ దాడిలో గ్రామానికి చెందిన బోయ మాదేశ్, కుమ్మరి కామేష్, తెలుగు రాజేశ్వరిని తీవ్రంగా గాయపరిచింది. గ్రామంలో కుక్కను చూసినా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గ్రామంలో కుక్కల సంతతి విపరీతంగా పెరగడంతో వాటి స్వైర విహారం ఎక్కువైందని, ఎక్కడ చూసినా గుంపులుగా దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం దసరా సెలవులు కావడంతో పిల్లలు వీధుల్లో ఆడుకునేందుకు వెళ్తుండటంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు వెంటనే చర్యలు  తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.