27-09-2025 07:53:17 PM
సిర్గాపూర్,(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ నుంచి గౌడ్గామ వెళ్లే రహదారి కల్వర్ట్ మధ్యలో ఏర్పడిన గుంత కారణంగా వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్థానికులు తెలిపిన సమాచారం ప్రకారం శుక్రవారం రాత్రి ద్విచక్ర వాహన దారుడు గుంత గమనించక అదుపుతప్పి పడ్డాడు. ఎలాంటి ప్రాణ హాని జరుగులేదు.
ఈ దారిగుండా రోజు వందల వాహనాలు రాకపోకలు సాగిస్తుంటారు. ఇక్కడ హెచ్చరిక బోర్డు లేకపోవడంతో అటుగా వెళ్తున్న జర్నలిస్టులు మౌలానా (మున్నా), నర్సిములు, రమేష్ గుంత చుట్టూ ముళ్లు వేసి తాత్కాలిక సూచికను ఏర్పాటు చేశారు. ఈ చర్యతో అధికారులకు వారి బాధ్యతను గుర్తు చేశారు. ఈ ప్రమాదకర గుంతపై అధికారులు వెంటనే స్పందించి, రహదారికి మరమ్మతులు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.