22-09-2025 07:09:34 PM
రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు
కామారెడ్డి,(విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ ఛైర్మన్ కాసుల బాలరాజ్ అన్నారు. సోమవారం బాన్సువాడ నియోజకవర్గం లోని పోతంగల్ మండల కేంద్రం సాయిబాబా మందిరం కల్యాణ మండపంలో ఉమ్మడి మండలాల కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం కు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెల్ల రేషన్ కార్డుదారులకు తమ ప్రభుత్వం సన్న బియ్యం అందిస్తోందని, రైతులకు రుణమాఫీ చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని అన్నారు. త్వరలో బోనస్ డబ్బులు కూడా అందజేస్తామని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, చేస్తున్న అభివృద్ధి పనుల గురించి ప్రజలకు వివరించాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు రానివారికి మంజూరు చేస్తామన్నారు.హాస్టళ్లలో పిల్లలకు సన్న బియ్యం భోజనం పెట్టిస్తున్నామని, మెస్ చార్జీలు పెంచామని తెలిపారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో నాయకులందరూ కలిసికట్టుగా పనిచేసి భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని కార్యకర్తలకు సూచించారు.