22-09-2025 07:11:46 PM
గాంధారి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని పెట్ సంగెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కు చెందిన విద్యార్థులు జిల్లా జట్టు కెప్టెన్లుగా ఎంపికయ్యారు. కామారెడ్డి జిల్లాకేంద్రంలోని సరస్వతి శిశుమందిర్ క్రీడా మైదానంలో జరిగిన సబ్ జూనియర్ జిల్లా స్తాయి కబడ్డి పోటీల్లో అద్భుతంగా రాణించిన ముగ్గురు క్రీడాకారులో బాలికల జట్టుకు బానోత్ ఉష, బాలుర జట్టుకు భుక్య అర్జున్ సారథ్యం వహిస్తున్నట్లు వ్యాయామ ఉపాధ్యాయుడి లక్ష్మణ్ రాథోడ్ తెలిపారు. వీరితో పాటుగా ఇదే పాఠశాల కు చెందిన అవంతిక కూడా ఎంపిక అయినట్లు ఆయన తెలిపారు. ఎంపిక అయిన క్రీడాకారులు ఈ నెల 25 నుండి నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలంలోని ఇండోర్ స్టేడియములో జరిగే 16 వ రాష్ట్ర స్థాయి కబడ్డి లో పాల్గొంటారని ఆయన సూచించారు, విధార్థుల ఎంపిక పట్ల ,బమన్ నాయక్ స్పోర్ట్స్ ఫౌండేషన్ బాధ్యులు గుగ్లోత్ సురేందర్,అధ్యక్షురాలు సేవంత రాథోడ్, బాలకృష్ణ గ్రామస్తులు, సీనియర్ క్రీడాకారులు తదితరులు ప్రత్యేకంగా అభినందించారు.