calender_icon.png 6 September, 2025 | 12:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిర్లక్ష్యపు నీడలో

01-09-2025 01:04:28 AM

- ప్రభుత్వాలు మారినా కనిపించని మార్పు

- అవసరానికి ఉపయోగ పడని వరద జలం

- వచ్చింది వచ్చినట్టు దిగువకే..

- ఎన్నికల సమయంలోహామీలమూటలు

గద్వాల్ ఆగస్టు 31 : ప్రభుత్వాలు మా రిన, పాలకులు మారిన జూరాల ప్రాజెక్ట్ పరిస్థితి మారడం లేదు. ఎగువ నుండి వరద వస్తున్నప్పటికీ దానిని తగినంత స్థాయిలో వాడుకోవడం లేదు అనేది చాలా రోజుల నుండి వస్తున్నటువంటి ప్రశ్న. ఈ సంవత్సరం జూన్ నుండి నేటి వరకు జూరాల ప్రా జెక్టు నుండి ఇప్పటికే 820 టీఎంసీలు దిగువన శ్రీశైలం ప్రాజెక్టుకి వదిలారు ఎగువ నుండి 840 టీఎంసీల వరద వస్తున్నప్పటికీ ఈ వరద నీటిని వడసి పట్టుకోవడం లేదు.

కేవలం ఈ ప్రాజెక్టు కింద ఉన్నటువంటి ఏ డు ఎత్తిపోతల రిజర్వాయర్లు ఉన్నప్పటికీ కేవలం ఇప్పటివరకు 4.12 టీఎంసీలు నీటిని మాత్రమే వాడుకున్నాం. జూరాల ప్రాజెక్టు దగ్గర ఉన్న విద్యుత్ పంప్ హౌస్ కి 200 టీఎంసీ నీటిని వాడుకోవడం జరిగింది. అ లాగే కోయిల్ సాగర్ ఎత్తిపోతల పథకానికి 1.9 టిఎంసి వాడుకోగా మిగిలిన వరద దిగువకు వదలడం వలన ఈ వరద నీటిని సరైన పద్ధతిలో వాడటం లేదు అనేది ఇక్కడ ఉన్న రైతుల ఆవేదన.

జూరాల ప్రాజెక్టు కెపాసిటీ గతంలో 11 టిఎంసి ఉండగా దానిని 9.657 టి.ఎం.సికి కుదించారు అయితే ప్రాజెక్ట్ ని ర్మాణం చేపట్టినప్పటి నుండి ఇప్పటివరకు షిల్ట్ తీయకపోవడం వలన దీని కెపాసిటీ ఇంకో 2టీఎంసీలు తగ్గిపోయింది అని చెప్పవచ్చు.

ఈ ప్రాజెక్టు కింద నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం ద్వారా ఏడూ రిజర్వాయర్లు ఉన్నప్పటికీ వాటి సామర్థ్యం 4.12 టీఎంసీ వాటిలో గుడ్డెం దొడ్డి 1 టిఎంసి, ర్యా లంపాడు రిజర్వాయర్ లో 4 టీఎంసీ కెపాసిటీ ఉన్నప్పటికీ కేవలం 2 టీఎంసీ నీటిని నిల్వ చేస్తున్నారు అలాగే నాగర్ దొడ్డి రిజర్వాయర్ 0.6, టిఎంసి తాటికుంట రిజర్వాయర్ 1.5 టిఎంసి ఉన్నప్పటికీ అక్కడ కేవలం 0.6 టిఎంసి నీటినీ మాత్రం నిల్వ చేయగా, ము చ్చిని పల్లి రిజర్వాయర్ 0. 9 టిఎంసి అలాగే సంఘాల రిజర్వాయర్ 0.6 టిఎంసి నీటిని నిల్వచేసి కాలువల ద్వారా రైతులకు వ్యవసా యం చేయటానికి నీటిని వదులుతున్నారు.

అయితే ఇంత వరద వస్తున్నప్పటికీ రిజర్వాయర్ల సామర్థ్యం పెంపుదల చేసి నీటిని అధి కంగా వాడుకోలేమా అనేది ఇక్కడ రైతుల ఆవేదన. జూరాల నీటి నిల్వ సామర్థ్యం తగ్గినప్పటికీ పైనుండి వరద ఎక్కువ వస్తున్న ప్పుడు దానిని వృధాగా దిగువకు వదిలాల్సిందేనా.

స్టోరేజ్ కెపాసిటీ పెంచుకోలేమా ప్ర స్తుత ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి ఒకవేళ జూరాల ప్రాజెక్టులో షిల్ట్ తొలగించినట్లయితే ప్రాజెక్టు సామర్థ్యం 9.టి.ఎం.సి ఉంటుంది షీల్ తీయకపోవడం వల్ల అంత నీటిని నిలుపుకోలేకపోతున్నాం ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా పాలకులు మారిన జూరాల పైన దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నది మన పాలమూరు జిల్లాకు చెందిన వ్యక్తి ము ఖ్యమంత్రి కావడం వలన ఈ ప్రాజెక్టు పైన దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ఉందని రైతు లు తమ అభిప్రాయం ను వ్యక్తం చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు కింద మరి కొత్తగా రిజర్వాయర్లు నిర్మించుకోవడానికి అవకాశం ఉన్నట్లయితే చూడాల్సినటువంటి బాధ్యత పాలకులది. ఏది ఏమైనప్పటికీ జూరాల ప్రా జెక్టు కింద వచ్చేటువంటి వరద నీటిని సరైన పద్ధతిలో వాడటం లేదు అనేటువంటిది చిక్కుముడి.