18-10-2025 08:11:09 PM
మందమర్రి (విజయక్రాంతి): బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ మండలానికి చెందిన కాంగ్రెస్, బిఆర్ఎస్, బిజెపి అన్ని పార్టీల నాయకులు మండలంలోని ఆదిల్ పేట గ్రామంలో గల అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టేను నిరసిస్తూ శనివారం నిర్వహించిన రాష్ట్రవ్యాప్త బంద్ మండలంలో విజయవంతమైంది. ఈ సందర్భంగా ఆయా పార్టీల నాయకులు మాట్లాడుతూ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. బంద్ విజయవంతానికి సహకరించిన ప్రజలకు, వ్యాపార, వాణిజ్య సంస్థలకు, విద్యాసంస్థలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆయా పార్టీ నాయకులు గందే రామచందర్, మాసు సంతోష్ కుమార్, పెంచాల రాజలింగు, ఆకుల అంజి, పెంచాల మధులు పాల్గొన్నారు.