18-10-2025 08:13:40 PM
విశ్రాంత గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు కాశీనాథ్ దేశాయ్
పెద్ద కొడప్గల్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్ మండల కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద బీసీ నాయకుల ఆధ్వర్యంలో బిసి లకు 42శాతం రిజర్వేషన్ సాధించే వరకు పోరాటం చేద్దామని విశ్రాంత గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు కాశీనాథ్ దేశాయ్ అన్నారు. ఆయన శనివారం పెద్ద కొడప్గల్ మండల కేంద్రంలో బిసి ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా, బంద్ కార్యక్రమాలలో పాల్గొని ప్రసంగించారు.
తెలంగాణ సాధన కోసం ఎలాగైతే సబ్బండ వర్గాలు ఏకమై తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామో అదేవిధంగా బిసి రిజర్వేషన్లను కూడా సాధించు కొందామని ఆయన పిలుపునిచ్చారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లు ను శాసన సభలో ఏకగ్రీవంగా ఆమోదించి కేంద్రప్రభుత్వ ఆమోదం కోసం పంపడం జరిగిందని ఆయన తెలిపారు. కేంద్రం కూడా బిసి రిజర్వేషన్ బిల్లు ఆమోదించాలని, ఇది తెలంగాణలో బీసీలందరి కోరిక అని ఆయన తెలిపారు.