18-10-2025 08:08:11 PM
అందరితో కలిసి మాట్లాడిన ఎఐసిసి పరిశీలకుడు
కామారెడ్డి (విజయక్రాంతి): జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి కోసం 30 మంది దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాలోని కామారెడ్డి ఎల్లారెడ్డి జుక్కల్ బాన్సువాడ నియోజక వర్గాల నుంచి డిసిసి అధ్యక్ష పదవి కోసం దరఖాస్తు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన తీరును ఏఐసీసీ పరిశీలకుడు రాజు పాల్ కరోలకు వివరించారు. ఒక్కొక్కరిని పిలిచి జిల్లా అధ్యక్ష పదవిని ఆశిస్తున్న వారి వివరాలను సేకరించడమే కాకుండా పార్టీ కోసం ఎప్పటి నుంచి పని చేశారని వివరాలను సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో అధ్యక్షులు జిల్లా అనుబంధ సంఘాల అధ్యక్షులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కాంగ్రెస్ సీనియర్ నాయకులు గ్రామ అధ్యక్షులు కుల సంఘాలు విద్యార్థి సంఘాలతో ప్రత్యేకంగా మాట్లాడినట్లు తెలిపారు.
జిల్లాల 30 మంది దరఖాస్తు చేసుకున్నారని ప్రతి ఒక్కరితో ప్రత్యేకంగా మాట్లాడడం జరిగిందని తెలిపారు. స్వీకరించిన దరఖాస్తులు వారి అభిప్రాయాలను ఏఐసిసికి ప్రత్యక్షంగాను ఆన్లైన్లోనూ అందిస్తున్నట్లు తెలిపారు. సంఘటన్ సృజన్ అభియాన్ దేశవ్యాప్త కార్యక్రమం అని ఇది పార్టీని పటిష్టవంతం చేయడానికి పాటి కోసం కష్టపడే వారిని గుర్తించి వారికి పదవులు ఇవ్వడానికి దేశవ్యాప్తంగా యువత మహిళలు అన్న గారిని వర్గాల గొంతుక వినిపించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రజల కోసం పోరాడుతుందని చెప్పారు.
పార్టీ సిద్ధాంతం కులము, మతము సంబంధం లేకుండా సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమాన్ని లక్ష్యంగా చేసుకొని అందర్నీ కలుపుకొని పోతుందని ఆయన చెప్పారు. యువకులు విద్యావంతులు సైజ్ ధాంతిక నిబద్ధత కలిగిన వ్యక్తులకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరు అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుంటామన్నారు. రాజ్యాంగ విలువలు రాజ్యాంగాన్ని కాపాడే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాసరావు, ఆకుల శ్రీనివాస్, నిమ్మ విజయకుమార్ రెడ్డి, బొంబోతుల లింగ గౌడ్, నా రెడ్డి మోహన్ రెడ్డి, గిరెడ్డి మహేందర్ రెడ్డి, మల్లికార్జున్, తదితరులు పాల్గొన్నారు.