18-10-2025 08:01:26 PM
బంద్ లో పాల్గొన్న అన్ని పార్టీల నాయకులు
స్వచ్ఛందంగా షాపులు మూసివేసిన వర్తకులు
మేమెంతో మాకంత నినాదంతో గర్జించిన బీసీ నాయకులు
సంస్థాన్ నారాయణపూర్,(విజయక్రాంతి): బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ బీసీ సంఘం నాయకులు తలపెట్టిన బంద్ సంస్థాన్ నారాయణపూర్ మండలంలో విజయవంతమయ్యింది. ఉదయం నుండే అన్ని పార్టీల నాయకులు రోడ్లపైకి వచ్చి బంద్ కు మద్దతు తెలిపారు. మేమెంతో మాకంత అంటూ నినాదాలు చేస్తూ స్థానిక చౌరస్తాలో బైఠాయించి నిరసన తెలిపారు.
మండలంలోని పుట్టపాక,గుడిమల్కాపూర్,సర్వేలు గ్రామాలలో ఎక్కడికక్కడ నిరసనలతో తమ మద్దతు తెలిపారు. అన్ని కుల సంఘాల ప్రజలు బంద్ కు మద్దతు తెలిపారు. మండలకేంద్రంలో వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేసి బంద్ లో పాల్గొన్నారు. విద్యాసంస్థలను బీసీ నాయకులు మూసివేయించారు. బస్సుల రాకపోకలు పూర్తిగా నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.