calender_icon.png 19 October, 2025 | 3:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ రైజింగ్ విజన్-2047 సర్వేలో భాగస్వాములు కావాలి

18-10-2025 08:05:51 PM

జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్

ములుగు,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రాన్ని రానున్న రోజులలో అభివృద్ది, సంక్షేమ రంగాలలో అగ్రగామిగా నిలిపేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ విజన్ - 2047 అంశాలతో డాక్యుమెంటును రూపొందిస్తున్నదని, ఈ సర్వేలో ఉద్యోగులు, అన్ని వర్గాల వారు భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ శనివారం ఒక ప్రకటనలో కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షలకు అనుగుణంగా రూపొందిస్తున్న ఈ విజన్ 2047 డాక్యుమెంట్ తయారీలో ప్రతి ఒక్క పౌరుడు పాల్గొనేలా సిటిజన్ సర్వే చేపట్టారని అన్నారు.

అక్టోబర్ 10వ తేదీన ప్రారంభమైన ఈ సర్వేలో ఇప్పటికే ప్రజలు, ప్రవాస భారతీయులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారని తెలిపారు. ఈ సర్వేలో ప్రతీ ఉద్యోగి పాల్గొని తమ సలహాలు, సూచనలు అందించాల్సిందిగా కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 14వ తేదీన సర్క్యులర్ జారీ చేసిందని కలెక్టర్ తెలిపారు. ఈనెల 25 వ తేదీ వరకు కొనసాగే విజన్-2047 సర్వేలో అందరు ఉద్యోగులు పాల్గొనడంతో పాటు ఈ సర్వే లింక్ ను, QR కోడ్ ను తమ తమ కార్యాలయాల్లో ప్రదర్శించాలి.

ఈ సర్వే గురించి విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు. తెలంగాణ రైజింగ్ విజన్ - 2047 డాక్యుమెంటరీని రూపొందించడంలో ప్రతి రాష్ట్ర పౌరుడు భాగస్వామ్యమై సిటిజన్ సర్వేలో పాల్గొని తమ ఆలోచనలను పంచుకోవాలని తెలిపారు. ఈ సర్వేలో పాల్గొనేందుకు http//www.telangana.gov.in/telanganarising/ అనే లింక్ ద్వారా పాల్గొనాలని సూచించారు.