calender_icon.png 19 October, 2025 | 3:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధి కార్యక్రమాల్లో రాష్ట్రపతిచే అవార్డు అందుకున్న భద్రాచలం ఐటీడీఏ

18-10-2025 08:04:15 PM

భద్రాచలం (విజయక్రాంతి): ఐటీడీఏ పరిధిలోని మారుమూల గిరిజన గ్రామాలను విజన్ 2030 నాటికి అభివృద్ధిలోకి తీసుకురావడానికి ధర్తీ ఆభాజాన్ జాతీయ గౌరవ అభియాన్, ఆది కర్మయోగి అభియాన్ కార్యక్రమంలో గ్రామాల అభివృద్ధికి అధికారులు చూపిన ప్రతిభకు న్యూఢిల్లీ విజ్ఞాన్ భవన్లో 17వ తేదీ శుక్రవారం రాత్రి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు, భద్రాచలం ఐటీడీఏ కార్యాలయానికి బెస్ట్ అవార్డు ప్రధానం చేశారు. ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ శనివారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు. 

ధర్తీ ఆభాజాన్ జాతీయ గౌరవ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఐటీడీఏ పరిధిలోని మారుమూల 19 మండలాలలోని 130 గ్రామాలలో ఆది కర్మయోగి అభియాన్ కార్యక్రమం ప్రారంభించడం జరిగిందని, ఇందులో ముఖ్యంగా ఐదు శాఖలు గిరిజన సంక్షేమ శాఖ, గిరిజన విద్యాశాఖ, వైద్యశాఖ, రూరల్ డెవలప్మెంట్, అంగనవాడి శాఖలను సమన్వయం చేస్తూ ప్రతి గ్రామంలో ఆది కర్మయోగి అభియాన్ పథకం అమలు చేయడానికి, ఐదు శాఖల అధికారులకు స్టేట్ లెవెల్ లో ప్రత్యేక శిక్షణ ఇచ్చి వారి ద్వారా జిల్లా మాస్టర్ శిక్షకులకు శిక్షణ అందించడం జరిగిందని, వీరి ద్వారా మండల స్థాయి మరియు గ్రామస్థాయి అధికారులకు శిక్షణ అందించి విజన్ 2030 నాటికి 130 గ్రామపంచాయతీలు అభివృద్ధి పథంలో తీసుకెళ్లడానికి ఆన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ గ్రామములో సాతి సహాయోగులను నియమించి వారి ద్వారా గ్రామంలో పర్యటించి గ్రామంలోని సమస్యలు తెలుసుకుని ప్రతి గ్రామములో నెలకొన్న సమస్యలు వారికి కావలసిన మౌలిక వసతులు 65 అంశాలలో రూ.1341(ఒక వెయ్యి మూడు వందల నలుబది ఒకటి) కోట్లు రూపాయల ప్రతిపాదనలను తయారుచేసి పోర్టల్ లో అప్లోడ్ చేయడం జరిగిందని అన్నారు. 

130 గిరిజన గ్రామాలలో ఆదిసేవా కేంద్రాలు ప్రారంభించి గ్రామంలో ఇంటింటికి తిరిగి గ్రామంలో నెలకొన్న సమస్యలు మరియు మౌలిక వసతులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించడానికి ఐటీడీఏ తరఫున సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, ఏవో సున్నం రాంబాబు మరియు ఇతర ప్రత్యేక అధికారులను నోడల్ ఆఫీసర్లుగా నియమించి, అలాగే ఎంపీడీవోలు, గ్రామ సెక్రటరీలు మరియు ఇతర శాఖల అధికారులు సిబ్బంది సమన్వయంతో గిరిజన సంక్షేమ సాధికారత మరియు సమ్మేళిత అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడంలో ప్రదర్శించబడిన అంకితభావం మరియు నిబద్ధత, ఎంతో ప్రశంసనీయమని, ఆది ఖర్మయోగి అభియాన్ పథకం అమలు కోసం అత్యుత్తమ పనితీరు మరియు ఆదర్శప్రాయమైన సహకారాన్ని ఉత్తమంగా ప్రదర్శించినందున భద్రాచలం ఐటీడీఏను గుర్తించి అత్యుత్తమ పనితీరు అవార్డును ప్రకటించడం జరిగిందని, సంబంధిత అధికారులు చాలా బాధ్యతతో విధులు నిర్వహించి ప్రతిపాదనలు తయారుచేసి సకాలంలో పంపినందుకు మన జిల్లాకు మరియు ఐటీడీఏకు ఈ అవార్డు రావడం గర్వకారణమని, ఈ సందర్భంగా ఆది ఖర్మయోగి అభియాన్ కార్యక్రమంలో ఎంతో బాధ్యతతో ప్రతిభ చూపిన ప్రతి ఒక్కరికి అభినందిస్తున్నట్లు ఆయన అన్నారు.