calender_icon.png 19 October, 2025 | 3:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ బంద్‌ సక్సెస్..

18-10-2025 07:59:57 PM

ఆల్ పార్టీల హాజరు..

కాటారం (విజయక్రాంతి): బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ తెలంగాణ రాష్ట్రంలో బీసీ అఖిలపక్షం ఇచ్చిన బంద్ పిలుపుమేరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం సబ్ డివిజన్ పరిధిలోని కాటారం, మహా ముత్తారం, మలహర్, మహాదేవపూర్, కాలేశ్వరం, పలిమెల  ప్రాంతాలలో బంద్ సక్సెస్ అయ్యింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బంద్ ప్రశాంతంగా జరిగింది. అఖిలపక్షం పిలుపుమేరకు ఆల్ పార్టీలు హాజరయ్యాయి. ఈ మేరకు కాటారం సబ్ డివిజన్ కేంద్రంలో కాంగ్రెస్, బిఆర్ఎస్, బిజెపి పార్టీలు వేర్వేరుగా బైక్ ర్యాలీ చేపట్టారు. బిసి సమైక్య జేఏసీ నాయకులు, ఎస్ ఎఫ్ ఐ విద్యార్థి సంఘంతో పాటు పలు బీసీ కుల సంఘాల నాయకులు బందుకు మద్దతు ప్రకటించి ర్యాలీలో పాల్గొన్నారు.  ముఖ్య కూడళ్లలో గల దుకాణాలను తెరిచి ఉంచడం పట్ల కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేయడంతో మూసివేశారు.

దీపావళి పండుగ నేపథ్యంలో దుకాణదారులు కొంత అసహనానికి గురయ్యారు. అలాగే నిత్యవసర వస్తువులతో పాటు దీపావళి నోములకు అవసరమయ్యే సామాగ్రి కొనుగోలుకు వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వీటితోపాటు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లేందుకు బస్సులు నడవకపోవడంతో ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారు. అలాగే మద్యం దుకాణాలకు టెండర్లు చివరి రోజు కావడం టెండర్ దారులకు బందుతో ఇబ్బంది ఏర్పడింది. బంద్ జరుగుతున్న తీరును ఈ సందర్భంగా కాటారం డిఎస్పి సూర్యనారాయణ స్వయంగా బంద్ పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కాటారం, మహాదేవపూర్ సర్కిల్ పరిధిలో ఆయా పోలీస్ సబ్ ఇన్ స్పెక్టర్లు, పోలీస్ సిబ్బందితో గట్టి బందోబస్తు నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు. బంద్ సక్సెస్ కావడం పట్ల బిసి జేఏసీ కృతజ్ఞతలు తెలిపారు.