calender_icon.png 18 October, 2025 | 8:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేజీబీవీలో మాక్ పంచాయతీ ఎలక్షన్స్

18-10-2025 04:48:04 PM

తుంగతుర్తి (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలోని కస్తూర్బా బాలిక విద్యాలయంలో శనివారం మాక్ పంచాయతీ ఎలక్షన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రభుత్వ అధికారులతో మమేకమై, ఎన్నికలను ఎలా నిర్వహిస్తారో, ప్రజలు ఓటు హక్కును ఎలా వినియోగించుకుంటారో, అనే విషయాన్ని కస్సుబా గాంధీ బాలికలు, స్వయంగా అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేశారు. ప్రచార నిర్వహించే విధానాలు, వాహనాలు, ఖర్చులు విషయాలతో సహా తెలియపరుస్తూ, ఓటు వేయడానికి విద్యార్థులు, బార్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం పాఠశాల సిబ్బంది ఓట్ల లెక్కించి విజేతను నిర్ణయించారు, ప్రత్యేక అధికారిని, కేజీబీవీఎస్ఓ కవిత ఆధ్వర్యంలో, ఎన్నికల అధికారిగా ఉపాధ్యాయులు ఎన్నికల సిబ్బంది గా విధులు నిర్వహించారు. విద్యార్థులకు పూర్తిగా ఎన్నికల నిర్వహణపై అవగాహన కల్పించారు.