18-10-2025 08:13:09 PM
కరీంనగర్ (విజయక్రాంతి): దుర్షేడ్ లో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల భూమి పూజలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలన్నింటినీ ఒక్కొక్కటిగా నెరవేర్చుతున్నదని పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో మోసం మాటల గారడి తప్ప వేరే ఏమీ లేదని విమర్శించారు. ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకొని మిగిలిపోయిన అర్హులకు ఇండ్లు మంజూరు చేస్తామని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాయిని తిరుపతి, మండల్ ప్రెసిడెంట్ కంరెడ్డి రాంరెడ్డి,గాజుల అంజయ్య, మీసాల సాయిలు, బుర్ర హరీష్ గౌడ్, పాలకుర్తి లక్ష్మన్ గౌడ్, కాశిపాక మురళి కృష్ణ, గాజుల శివ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.