18-10-2025 08:15:28 PM
స్వచ్ఛందంగా వ్యాపార సంస్థలు బంద్..
కదలని బస్సు చక్రాలు..
జహీరాబాద్ టౌన్: రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని ఇచ్చిన పిలుపుకు జహీరాబాద్ ప్రాంతంలో బంద్ సక్సెస్ అయింది. తెలంగాణ రాష్ట్ర బంద్కు బీసీ సంఘాలు పిలుపుతో జహీరాబాద్ లో బీసీ సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపు మేరకు బంద్ సక్సెస్ అయింది. వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. జహీరాబాద్ లోని ఆర్టీసీ బస్సులు ఒకటి కూడా బయటకు రాలేదు. శనివారం ఉదయం నుండి బీసీ ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు ద్విచక్ర వాహనాలపై తిరుగుతూ బందుకు సహకరించాలని కోరారు.
ఈ బందుకు భారతీయ జనతా పార్టీ, భారతీయ రాష్ట్ర సమితి పూర్తి మద్దతు ప్రకటించాయి. ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రైవేటు బస్సులు కర్ణాటక చెందిన తుఫాన్ వాహనాల్లో ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్ళవలసిన పరిస్థితులు నిలగున్నాయి. దీంతో వాహనదారులు ప్రయాణికుల నుండి అధికంగా డబ్బులు వసూలు చేశారు. బంద్ కార్యక్రమంలో పెద్ద గొల్ల నారాయణ, విశ్వనాథ్ యాదవ్, తట్టు నారాయణ, సంగప్ప ముదిరాజ్ ఉగేది రాములు కొండాపురం నరసింహులు షికారి గోపాల్, కోహిర్ నరసింహులు, అమిత్ కుమార్ బరువు దత్తాత్రి శంకర్ సాగర్ రాజు శంకర్ సుధీర్ బండారి శివప్రసాద్ వివిధ కుల సంఘాల బీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.