04-08-2025 12:00:00 AM
- ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలుపై దృష్టిసారించాలి
- మేడ్చల్‌లో 19 నుంచి 22 తేదీ వరకు సీపీఐ రాష్ట్ర మహాసభలు
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు శంకర్ వెల్లడి
మంచిర్యాల, ఆగస్టు 3 (విజయక్రాంతి) : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కలవేన శంకర్ అన్నారు. సీపీఐ కార్యాలయంలో ఆది వారం నిర్వహించిన జిల్లా కార్యవర్గం, మండల కార్యదర్శుల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయ న మాట్లాడారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు.
ఇప్పటికైనా ఎన్నికల హామీలను అమలు చేయాలని, గృహ జ్యోతి దరఖాస్తుల ఆన్ లైన్ ప్రారంభించాలని, మహాలక్ష్మి పథకం కింద మహి ళలకు రూ. 2,500 ఇవ్వాలని, చేయూత పథకం పెన్షన్‌లు రూ. 4 వేలు, ఆరోగ్య భద్రత రూ. 10 లక్షలు అమలు చేయాలని, సదరం సర్టిఫికెట్ ల గడువు ముగిసిన వారు పెన్షన్‌లు రాక ఇబ్బందులు పడుతున్నారని, గడువు పొడిగించి వికలాంగుల ఇబ్బందులను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఈ నెల 19 నుంచి 22 వరకు మేడ్చల్ లో జరుగనున్న సీపీఐ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఖలీందర్ అలీ ఖాన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, జిల్లా కార్యవర్గ సభ్యులు మేకల దాసు, మిట్టపల్లి వెంకటస్వామి, బోల్లం పూర్ణిమ, రేగుంట చంద్రశేఖ ర్, చిప్ప నర్సయ్య, దాగం మల్లేష్, జోగుల మల్లయ్య, మిట్టపల్లి శ్రీనివాస్, ఇప్పకాయల లింగయ్య, కారుకూరి నగేష్, లింగం రవి, రేగుంట చంద్రకళ, జిల్లా సమితి సభ్యులు నెన్నెల సమ్మయ్య, బొంతల లక్ష్మీనారాయ ణ, దేవీ పోచన్న, ఆడేపు రాజమౌళి, కొండు భాణేష్, అందే పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.