04-08-2025 12:00:00 AM
ఖమ్మం, ఆగస్టు -3 (విజయక్రాంతి): కృ ష్ణా, గోదావరి నదులలో ఒక్క నీటి చుక్క కూ డా తెలంగాణ వాటా వదులుకునే ప్రసక్తే లేదని డిప్యూటీ సి.ఎం. భట్టి విక్రమార్క మ ల్లు స్పష్టం చేశారు.రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆర్థిక, ఇంధన శాఖల మంత్రి భట్టి విక్రమా ర్క మల్లు ఆదివారం మధిర నియోజకవర్గం ముదిగొండ మండలంలో పర్యటించి,
జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, పోలీస్ కమీషనర్ సునీల్ దత్, వేర్ హౌసింగ్ కార్పోరేషన్ ఎం. డి. లక్ష్మీ లతో కలిసి కమలాపురం గ్రామంలో 10 కోట్ల రూపాయలతో నిర్మించనున్న 10 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాం నిర్మాణానికి శంకుస్థాపన చేసి ఏర్పాటు చేసి న బహిరంగ సభలో రైతులు, ప్రజలనుద్దేశించి మాట్లాడారు. మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ రాష్ట్రంలో 5 లక్షల 91 వేల మె ట్రిక్ టన్నుల గోడౌన్ సామర్థ్యం ఉంటే,
గత 20 నెలల కాలంలో గిడ్డంగుల సంస్థ ద్వారా 10 లక్షల 75 వేల మెట్రిక్ టన్నుల సామ ర్థ్యం గిడ్డంగుల నిర్మాణానికి కృషి చేస్తున్నామని అన్నారు. సకాలంలో సాగు నీటి సరఫ రా, రుణమాఫీ, రైతు భరోసా వంటి అనేక కార్యక్రమాలు అమలు చేయడం వల్ల దేశంలోనే అత్యధికంగా వరి ఉత్పత్తి మన రైతులు సాధించారని అన్నారు.నాగార్జున సాగర్ టె యిల్ ఎండ్ ప్రాంతాలకు నీటి ఇబ్బంది వల్ల మనం నష్టపోతున్నామని అన్నారు.
రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణం వల్ల నా గార్జున సాగర్ నిండదని, దీని వల్ల ఖమ్మం జిల్లా రైతాంగం నష్ట పోతుందని అన్నారు. గత పాలకులు కృష్ణ, గోదావరి నదులపై ప్రాజెక్టు కట్టలేదని అన్నారు. కృష్ణాపై జూ రాల, కల్వకుర్తి, బీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్ వంటి ప్రాజెక్టులను గత కాంగ్రెస్ ప్ర భుత్వాలు పూర్తి చేశాయని అన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయ కుండా పెండింగ్ పెట్టారని డిప్యూటీ సీఎం విమర్శించారు.
ప్రతి రోజూ 13 టీఎంసీల నీరు శ్రీశైలం ప్రాజెక్ట్ పై భాగం నుండి రా యలసీమకు లిఫ్ట్ చేసేలా వ్యవస్థను ఆంధ్రప్రదేశ్ తీసుకునేలా చేస్తుందని, ఈ దోపిడి ఇ లాగే కొనసాగితే 30 రోజులలో శ్రీశైలం ఖాళీ అవుతుందని అన్నారు. గోదావరి నది పై ఎస్సారెస్పీ, శ్రీపాద ఎల్లంపల్లి, దేవాదుల ప్రాజెక్టులను నిర్మించామని ఖమ్మం జిల్లాలో రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ ప్రాజెక్టుల ప నులు చేపట్టామని అన్నారు.
ప్రాణహిత చే వెళ్ల ప్రాజెక్టు క్రింద తుమ్మిడి హట్టి నుంచి ఎల్లంపల్లి నీళ్ళు తెచ్చేలా ప్రాజెక్టు డిజైన్ చేస్తే గత పాలకులు వాటిని నిర్లక్ష్యం చేశారని, కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టు నిర్మాణం వల్ల ఒక చుక్క నీళ్ళు ఇవ్వలేదని అన్నారు. గత బీఆర్‌ఎస్ హయంలో ప్రాజెక్టులు పూర్తి చేస్తే నీళ్ళు క్రిందికి వెళ్ళేవి కాదని అన్నారు. రాజకీయ విమర్శలకు తావు లేకుండా బనకచర్ల ప్రాజెక్టును అందరం వ్యతిరేకించాలని అన్నా రు.
సముద్రంలో పోతున్నాయని ప్రాజెక్టు క ట్టుకుంటే తర్వాత నీటి పంపిణి సమయం లో నీటి కేటాయింపులు లభిస్తాయని అన్నా రు. తెలంగాణ ప్రభుత్వం అన్ని దశలలో బనకచర్ల ప్రాజెక్టును వ్యతిరేకిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చై ర్మన్ రాయల నాగేశ్వరరావు, తెలంగాణ హ స్త కళల చైర్మన్ నాయుడు సత్యనారాయణ, డిసిసిబి చైర్మన్ దొండపాటి వెంకటేశ్వర రావు, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కళావతి బాయి, జిల్లా మార్కెటింగ్ అధికారి ఎం.ఏ. అబ్దుల్ అలీమ్, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు, రైతులు, ప్రజలు, సాం స్కృతిక సారథి కళాకారులు పాల్గొన్నారు.