calender_icon.png 22 July, 2025 | 5:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంక్షేమానికి మారుపేరు కాంగ్రెస్

22-07-2025 12:51:55 AM

  1. మహిళా సాధికారతకు పెద్దపీట 
  2. మంత్రులు పొంగులేటి, శ్రీధర్‌బాబు 

జయశంకర్ భూపాలపల్లి (మహబూబాబాద్), జూలై 21 (విజయక్రాంతి): సంక్షేమా నికి మారుపేరు కాంగ్రెస్ అని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గోరి కొత్తపల్లి, గణపురం మండలాల్లో సోమవారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో వారు పాల్గొన్నారు. గోరికొత్తపల్లిలో పోలీస్ స్టేషన్ ను ప్రారంభించారు.

గణపురం మండలం చెల్పూర్‌లో బస్‌స్టాండ్ నిర్మాణ పనులను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, స్టేట్ ప్రమోషన్ చైర్మన్ అయిత ప్ర కాష్‌రెడ్డి, కలెక్టర్ రాహుల్‌శర్మ, ఎస్పీ కిరణ్ ఖరేతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భం గా జరిగిన సమావేశంలో మంత్రులు మా ట్లాడుతూ.. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వానంగా మారిందని, కాం గ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థికం గా ఇబ్బందులు ఉన్నప్పటికీ అభివృద్ధి, సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో పనిచేస్తున్నామన్నారు.

కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనేది సీఎం రేవంత్‌రెడ్డి కోరిక అని పేర్కొన్నారు. గత ప్రభుత్వం చేసిన 8 లక్షల కోట్ల రూపాయల అప్పు భారం మోస్తూనే 10 నెలల్లో 21 వేల కోట్లు రైతులకు రుణమాఫీ చేశామని, రైతు భరో సా పథకం ద్వారా 9 రోజుల్లో 9 వేల కోట్లు రైతుల ఖాతాలో జమ చేశామని తెలిపారు. 5 లక్షల కొత్త రేషన్ కార్డులతో పాటు 16 లక్ష ల కొత్త పేర్లను పాత కార్డులలో నమోదు చేశామని తెలిపారు.

అర్హులైన ప్రతి పేద వా రికి విడతల వారీగా ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు. ప్రతి సోమవారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అనుగుణంగా లబ్ధిదారులకు డబ్బులు జమ చేస్తున్నామని వెల్లడించారు.  కర్ణాల కుంట 180 ఎకరాల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గణపురంలో 60 ఎకరాలలో పారిశ్రామిక పార్కు ఏర్పా టు చేశామని మహిళలకు మినీ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయటం కోసం 20 ఎకరాల కేటాయించినట్లు తెలిపారు.

ప్రభుత్వం పరిశ్రమ ల ఏర్పాటుకు సబ్సిడీ ఇస్తుందని, సద్వినియోగం చేసుకుని వ్యాపారవేత్తలు ఎదగాల ని సూచించారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ మాట్లాడుతూ జిల్లాకు బైపాస్ రోడ్డు, మైనింగ్ కళాశాల, పాలిటెక్నిక్ కళాశాల, డీబీ ఎం 38 కాలువకు 320 కోట్లు మంజూరు చేయాలని కోరారు. 

దీని వల్ల 44,700 ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుందని తెలి పారు. కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్లు అశోక్‌కుమార్, విజయలక్ష్మి, ఆర్టీసీ అధికారులు సలోమం, ఆర్‌ఎం విజయభాను, డీఎం ఇం దు, సింగిల్‌విండో చైర్మన్లు కుమార్‌యాదవ్, ఏఎంసీ చైర్మన్లు కిష్టప్ప,శ్రీదేవి పాల్గొన్నారు.