calender_icon.png 22 July, 2025 | 5:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పరిశ్రమలకు అనుగుణంగా కోర్సులుండాలి

22-07-2025 12:56:21 AM

  1. జీనోమ్ వ్యాలీలో మోడల్ ఏటీసీని ఏర్పాటు చేయండి
  2. ఏటీసీల అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తిచేయాలి
  3. ఏటీసీల పురోగతిపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష
  4. గిగ్‌వర్కర్ల పాలసీపై సైతం అధికారులతో రివ్యూ

హైదరాబాద్, జూలై 21 (విజయక్రాంతి): పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా కోర్సులు, శిక్షణ అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ (ఏటీసీ)ల అభివృద్ధి, పనుల్లో పురోగతిపై సోమవారం సచివాలయంలో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నిర్దేశిత సమయానికి అనుగుణంగా వీలైనంత త్వరగా ఏటీసీల అభివృద్ధి పనులు పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.

ఏటీసీల అభివృద్ధి, పురోగతిపై ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానని సీఎం పే ర్కొన్నారు. ఏటీసీలను వీలైనంత త్వరగా పూ ర్తిగా చేసేందుకు అవసరమైతే నైపుణ్యమున్న నిర్మాణ సంస్థల సహకారం తీసుకోవాలని సూచించారు. జీనోమ్ వ్యాలీలో మోడల్ ఏటీసీని ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఫార్మా, బయోటెక్నాల జీ, లైఫ్ సెన్సైస్ పరిశ్రమలకు అవసరమైన శిక్షణను అందించే కోర్సులను అక్కడ నిర్వహించాలని సీఎం అధికారులకు సూచిం చారు.

అవసరమైన స్థలం కేటాయింపుతో పాటు అధునాతన సెంటర్ ఏర్పాటుకు ప్రతిపాదనలు తయారు చేయాలని ఆదేశించా రు. రాష్ర్టంలో మూడు దశల్లో 111 ఏటీసీలను అభివృద్ధి చేయనున్నట్టు అధికారులు సీఎంకు తెలిపారు. ఫేజ్--1లో 25, ఫేజ్--2 లో 40, ఫేజ్-3లో 46 ఏటీసీలను అభివృ ద్ధి చేయనున్నట్టు పేర్కొన్నారు. ఫేజ్--1,2లో ఇప్పటి వరకు 49 అందుబాటులోకి వచ్చాయన్నారు.

గిగ్ వర్కర్ల పూర్తి సమాచారం ఆన్‌లైన్‌లో ఉండాలి..

గిగ్ వర్కర్లకు సంబంధించిన పూర్తి సమాచారం ఆన్‌లైన్‌లో ఉండేలా చర్యలు తీసుకో వాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. గిగ్ వర్కర్ల పాలసీపై సీఎం రేవంత్ రెడ్డి సోమవారం హైదరాబాద్‌లోని తెలంగాణ సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు.

సంక్షేమ నిధిని ఏర్పా టు చేయడంతో పాటు గిగ్ వర్కర్లకు ప్రమా ద బీమా, హెల్త్ ఇన్సురెన్స్ సౌకర్యాలను కల్పించేలా చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి సూచించారు. గిగ్ వర్కర్లకు చట్టబద్ధమైన గుర్తింపు, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ప్రభుత్వం ప్రాతినిధ్యం వహించేలా పాలసీలో మార్పులు చేయాలని అధికారులు ప్రతిపాదించారు.