calender_icon.png 26 October, 2025 | 4:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నూతన బ్యాంకు, పోస్టాఫీస్ మంజూరు చేయాలని కాంగ్రెస్ నేత రావుల రాంరెడ్డి వినతి

25-10-2025 05:15:06 PM

ఆర్థిక లావాదేవీలు, పోస్టల్ సేవలు సులభతరం కావాలంటే ఈ రెండు సంస్థలు తప్పనిసరి..

రావుల రాంరెడ్డి..

మరిపెడ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండల కేంద్రంలో ప్రజల సౌకర్యార్థం నూతన బ్యాంకు, పోస్టాఫీస్ మంజూరు చేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా సీనియర్ నాయకులు రావుల రాంరెడ్డి జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రాంరెడ్డి మాట్లాడుతూ చిన్నగూడూరు మండల కేంద్రం పరిధిలో అనేక గ్రామాలు ఉండి, జనాభా ఎక్కువగా ఉన్నా కూడా ఇప్పటి వరకు సరైన బ్యాంకు, పోస్టల్ సేవలు అందుబాటులో లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు తమ ఆర్థిక లావాదేవీలు, ప్రభుత్వ పథకాల సబ్సిడీలు, పింఛన్లు, డబ్బు పంపకాలు వంటి పనుల కోసం సమీప పట్టణాలైన మహబూబాబాద్, మరిపెడ, తొర్రూరు, వంటి ప్రాంతాలకు వెళ్ళి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

మండల స్థాయిలో బ్యాంకు, పోస్టాఫీస్ లేని కారణంగా విద్యార్థులు, రైతులు, వృద్ధులు, మహిళలు, ఉద్యోగులు అందరూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన వివరించారు. ఈ రెండు సంస్థలు స్థాపించబడితే స్థానిక ప్రజలకు మాత్రమే కాకుండా పరిసర గ్రామాల ప్రజలకు కూడా ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొన్నారు. అలాగే, బ్యాంకు మరియు పోస్టాఫీస్ ఏర్పాటు వల్ల ఆర్థిక లావాదేవీలు వేగవంతమవుతాయని, గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుందని, ప్రభుత్వ పథకాల అమలు సులభతరం అవుతుందని తెలిపారు. చిన్నగూడూరు మండల ప్రజలు దీర్ఘకాలంగా ఈ సదుపాయాల కోసం ఎదురుచూస్తున్నారని గుర్తుచేస్తూ, ప్రజల తరఫున తక్షణ చర్యలు తీసుకొని నూతన బ్యాంకు, పోస్టాఫీస్ మంజూరు చేయాలని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ ని రావుల రాంరెడ్డి కోరారు.