25-10-2025 05:18:06 PM
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బసవపున్నయ్య..
మంచిర్యాల (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లాలో కొంతమంది విలేకరులు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) పేరిట కార్యక్రమాలు చేస్తూ ప్రజలను, అధికారులను, నాయకులను తప్పుదోవపట్టించే ప్రయత్నం చేస్తున్నారని, అలాంటి వారిని నమ్మవద్దని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్(TWJF) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోడిగె బసవపున్నయ్య(BODIGE BASAVAPUNNAIAH) శనివారం ప్రకటించారు.
గతంలో రెండు పర్యాయాలు ఫెడరేషన్ అధ్యక్షునిగా పనిచేసిన తోట్ల మల్లేష్ యాదవ్(TOTLA MALLESH YADAV) ఆధ్వర్యంలో పనిచేస్తున్న సంఘాన్ని మాత్రమే ఫెడరేషన్ సంఘంగా గుర్తించాలని ఆయన కోరారు. కొందరు వ్యక్తులు సంఘం పేరుతో, సంఘానికి సంబంధం లేకుండా కార్యక్రమాలు చేస్తు అందరిని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని, అలాంటి వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ విషయంపై జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి (DPRO)కి లేఖను పంపుతామని తెలిపారు. ఏవైనా సందేహాలు ఉంటే 94900 99108లో సంప్రదించవచ్చన్నారు.