సీఐఐ గ్రీన్ సిమెంటెక్ 21వ ఎడిషన్ ప్రారంభం
ముషీరాబాద్, మే 15 (విజయ క్రాంతి) : భారత దేశంలో సిమెంట్ రంగం ప్రపంచంలోనే అత్యంత సమర్థవంతమైన రంగాలలో ఒకటిగా నిలుస్తుందని పలువురు వక్తలు అ న్నారు. ఆర్థిక, పర్యావరణ విలువలను అందిస్తుందని పేర్కొన్నారు. సిమెంట్ రంగంలో సస్టైనబిలిటీ నడిపించే వేదిక అయిన సిఐఐ గ్రీన్ సిమెంటెక్ 21వ ఎడిషన్ రోడ్ టువారడ్స్ నెట్ జీరో కార్బన్(నికర సున్నా కార్బన్ దిశగా ప్రయాణం) అనే నేపథ్యంతో గురువారం హెచ్‌ఐసిసిలో ప్రారంభమైందని సిఐ ఐ ప్రతినిధులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
సిమెంట్ తయారీదారుల సంఘం(సిఎంఏ) భాగస్వామ్యంతో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ(సిఐఐ) మే 15, 16 తేదీలలో ఈ వార్షిక సిమెంట్ సమావేశాన్ని నిర్వహిస్తుంది. ఈ సమావేశంలో అంబుజా సిమెం ట్స్ లిమిటెడ్(అదానీ గ్రూప్) ఎండీ, గ్రీన్ సిమెంట్-25 చైర్మన్ అజయ్ కపూర్, సాగర్ సిమెంట్స్ లిమిటెడ్ జాయింట్ ఎండీ ఎస్ .శ్రీకాంత్ రెడ్డి, గ్రీన్ సిమెంట్ 2025 కో చైర్మ న్, అల్ట్రాటెక్ సిమెంట్ లిమిటెడ్ లో చీఫ్ టెక్నికల్, చీఫ్ సస్టైనబిలిటీ ఆఫీసర్ డాక్టర్ రాజు గోయల్ పాల్గొని ప్రసాగించారు.






