calender_icon.png 28 January, 2026 | 12:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్‌కు షాక్...!

28-01-2026 10:35:56 AM

బీఆర్ఎస్‌లోకి  భారీ చేరికలు

గులాబీ పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే కోవలక్ష్మి

కుమ్రంభీంఆసిఫాబాద్(విజయక్రాంతి): పట్టణంలోని బజార్‌వాడికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు షబ్బీర్ ఆధ్వర్యంలో 50 మందికి పైగా కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కోవ లక్ష్మి వారందరికీ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తూ, ప్రజల పక్షాన పోరాడే ప్రతి ఒక్కరికి బీఆర్ఎస్ గడప ఎల్లప్పుడూ తెరిచే ఉందని భరోసా ఇచ్చారు. కోవ లక్ష్మి  నాయకత్వంలోనే నిజమైన అభివృద్ధి సాధ్యమని నమ్మి ఈ  నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలిపారు. అనంతరం తమ ప్రాంతంలో నెలకొన్న రోడ్లు, నీటి సరఫరా, కాలనీలలోని పలు సమస్యలపై  వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సింగిల్ విండో చైర్మన్ అలీ బిన్ అహ్మద్, టౌన్ ప్రెసిడెంట్ అహ్మద్, మాజీ సర్పంచ్ మర్సకోల సరస్వతి, మాజీ వైస్ ఎంపీపీ కలాం,నాయకులు షాకీర్, నిస్సార్ ,అన్సార్, పొన్నాల నారాయణ, సయ్యద్ జావీద్, హకీం అన్సారి, షకీల్, సాజిద్, ఎం.డి. తాజ్, అఖిల్, సబిల్, ఐఫాన్, ఫర్జిన్ తదితరులు పాల్గొన్నారు.