calender_icon.png 28 January, 2026 | 12:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డ్రైనేజీ నిండి ఇండ్ల ముందుకు చేరిన మురికి నీరు

28-01-2026 10:37:45 AM

బెజ్జూర్ జనవరి 28 (విజయ క్రాంతి): కొమరంభీం జిల్లా కాగజ్‌నగర్‌ పట్టణంలోని బాలాజీ నగర్ లో డ్రైనేజీ నుండి ఇండ్ల ముందుకు మురికి నీరు చేరిందని కాలనీ ప్రజలు వాపోతున్నారు. డ్రైనేజీలు శుభ్రం చేయకపోవడంతో చెత్తాచెదారంతో నిండిపోయి మురికి నీరు ఇండ్ల ముందుకు చేరడంతో దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నామని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇండ్ల ముందుకు మురికి నీరు చేరడంతో కాలనీవాసులు రోడ్డుమీద నిరసన తెలిపారు.గత కొన్ని రోజుల నుండి డ్రెయినేజీ నిండి ఇండ్ల లోకి మురుగు నీరు వస్తుందని మునిసిపల్ అధికారుల చెప్పిన పట్టించుకోవడం లేదని దీనితో కాలనీ ప్రజలు ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి తమ సమస్య పరిష్కరించాలని నిరసనకు దిగినట్లు తారని ప్రజలు తెలిపారు.