calender_icon.png 1 May, 2025 | 5:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిరక్షణ యాత్ర

14-04-2025 12:00:00 AM

చేగుంట, ఏప్రిల్ 13 : చేగుంట మండల పరిధిలోని జైత్రం తండా, గొల్లపల్లి, రాంపూర్, కన్యారం, సోమ్లా తండాలో ఆదివారం మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్, కోఆర్డినేటర్ జనగామ మల్లారెడ్డి ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిరక్షణ యాత్ర ఘనంగా నిర్వహించారు, జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ నినాదాలతో గ్రామంలోని ప్రధాన వీధుల గుండా యాత్ర నిర్వహించారు. అంబేద్కర్, గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసిన అనంతరం మండల నాయకులను సత్కరించారు. కోఆర్డినేటర్ జనగామ మల్లారెడ్డి మాట్లాడుతూ రాజ్యాంగ పరిరక్షణ అందరి బాధ్యత అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ మొజామిల్,ఓబీసీ సెల్ అధ్యక్షులు అన్నం ఆంజనేయులు, ఎస్సీ సెల్ అధ్యక్షులు స్టాలిన్ నర్సిములు,ఎస్టీ సెల్ అధ్యక్షులు ఫకీర్ నాయక్, కిసాన్ సెల్ అధ్యక్షులు చౌదరి శ్రీనివాస్, మండల యూత్ అధ్యక్షులు మోహన్ నాయక్,గ్రామ అధ్యక్షు చాకలి అశోక్,  కాషాబోయిన శ్రీనివాస్, తయ్యాబ్, జైత్రం, బిక్షపతి, బాలారెడ్డి, కన్యారం సతీష్, రాజు నాయక్, బిక్య నాయక్ ఉన్నారు.